గరుడ ఆర్టీసీ బస్సుల చార్జీలను తగ్గించిన తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నాలుగు మార్గాల్లో గరుడ ధరలను తగ్గించింది. ఆర్టీసీ వర్గాలు అందించిన సమాచారం మేరకు టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ - వరంగల్ రూట్లో రూ.54, హైదరాబాద్ - విజయవాడ రూట్లో రూ.100, హైదరాబాద్ - ఆదిలాబాద్ రూట్లో రూ.111, హైదరాబాద్ - భద్రాచలం రూట్లో రూ.121 మేరకు ప్రయాణ చార్జీలు తగ్గించింది.
మేడారం జాతరకు వెళ్లే ప్రస్తుత సర్వీసులు, ప్రత్యేక సర్వీసులకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కొత్త ఛార్జీలు 31 మార్చి 2022 వరకు వర్తిస్తాయని వర్గాలు తెలిపాయి. టీఎస్ ఆర్టీసీ మేడారం వరకు దాదాపు 4 వేల బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే.