కేసీఆర్ దొంగ పాస్ పోర్టుల ఏజెంట్... అప్పుడు జైలుకెళ్తే... ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణలో రాజకీయం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలలో కేసీఆర్ తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. చంద్రబాబును ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అని.. కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం ఏంటి అంటూ తీవ్ర స్ధాయిలో విమర్శించారు.
కేసీఆర్ వ్యాఖ్యల పైన మహాకూటమి నాయకులు ఫైర్ అయ్యారు. టీపీసీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… నిరాహార దీక్షలో కేసీఆర్ కేవలం గడ్డం మాత్రమే పెంచుకున్నారని చెప్పారు. నిమ్స్ హాస్పిటల్ ఇచ్చిన నివేదిక చూస్తే… కేసీఆర్ బాగోతం బయటపడుతుందని… అవసరమైన ఫ్లూయిడ్స్ తీసుకుని దొంగ దీక్ష చేసారన్నారు.
నిజామాబాద్ సభలో తన గురించి అడ్డుగోలుగా మాట్లాడారు… నేను దేశం కోసం సరిహద్దుల్లో పైలెట్‌గా పని చేసా. కేసీఆర్ దుబాయికి దొంగ పాస్‌పార్ట్‌ల ఏజెంట్‌గా వర్క్ చేసారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళితే అప్పటి ఎంపీ ఎం. సత్యనారాయణ రావు కేసీఆర్‌ను జైలు నుంచి బయటకు తీసుకువచ్చారని తెలియచేసారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.