శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (11:34 IST)

నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్నాయి. ఇందులోభాగంగా, శుక్రవారం సాయంత్రం సాయంత్రం ప్రారంభ కార్యక్రమం కన్నులపండువగా జరుగనుంది.

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్నాయి. ఇందులోభాగంగా, శుక్రవారం సాయంత్రం సాయంత్రం ప్రారంభ కార్యక్రమం కన్నులపండువగా జరుగనుంది. ప్రారంభ వేడుకల కోసం ఎల్బీ స్టేడియంలో ప్రధాన వేదికను కళ్లు చెదిరేలా సుందరీకరించారు. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మొదలయ్యే ప్రతిష్టాత్మక సాహితీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశిష్ట అతిథులుగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరవుతున్నారు.
 
ఈ మహాసభలు ఈనెల 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు.. తెలుగు విశ్వవిద్యాలయం, లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, రవీంద్రభారతి, లలిత కళాతోరణం, తెలంగాణ సారస్వత పరిషత్తు వేదికలపై కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
 
తెలుగు భాషా సాహిత్యంలో తెలంగాణ కవులు, రచయితల పాత్రపై విస్తృతంగా చర్చిస్తారు. తెలంగాణ పద్య కవితా సౌరభం, వచన కవితా వికాసం, కథ, నవలా సాహిత్యం, తెలంగాణ విమర్శ- పరిశోధన అంశాలపై సదస్సులు, తెలంగాణలో తెలుగు భాష, అష్టావధానం, పద్యకవి సమ్మేళనం, జంట కవుల అష్టావధానం, బృహత్ కవి సమ్మేళనం లాంటి కార్యక్రమాలను ఐదురోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తారు.