బ్రహ్మికి కోపవచ్చిందట..హేమ వద్దంటున్న కమెడియన్!
బ్రహ్మికి అదేనండి బ్రహ్మానందంకు కోపమొచ్చేసిందట. ప్రతి సినిమాలోనూ బ్రహ్మానందానికి భార్యగా చేసి చేసి బోర్ కొట్టేసిదంటూ ఓ ఇంటర్వ్యూలో నటి హేమ చెప్పిన విషయంతో బ్రహ్మి హర్ట్ అయిపోయాడట. క్యారెక్టర్ నటి హేమ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ బ్రహ్మానందాన్ని బాగా హర్ట్ చేసిందట. ప్రతి సినిమాలోనూ బ్రహ్మానందానికి భార్యగా చేసి చేసి బోర్ కొట్టేసిందంటూ ఆ ఇంటర్వ్యూలో హేమ చెప్పిన విషయం మన కమెడియన్ దృష్టికి వెళ్ళడంతో, ఆయనకి కోపం వచ్చిందట.
దాంతో కొత్తగా తన వద్దకి వస్తున్న దర్శక నిర్మాతలకు... తన సరసన మరో నటిని చూడమంటూ బ్రహ్మానందం తేల్చి చెప్పేస్తున్నాడని అంటున్నారు. ఈ విషయం తెలిసిన హేమ, 'అయ్యో ... నేను ఊరికే చెప్పిన మాట ఇంతవరకు వచ్చిందా?' అంటూ వాపోతోందట! ఇంకేముంది..? బ్రహ్మానందంతో పెట్టుకుంటే అంతే మరి. అసలుకే ఎసరు వస్తుంది. ఆయనకి కోపమొస్తే ఇక వాళ్ల పని అయిపోయినట్టే. జాగ్రత్తగా ఉండాలి మరి. నటి హేమా.. తెలుసుకోమ్మా..!