ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (08:37 IST)

ఆదిపురుష్ లో సీన్ కోసం 60 కోట్లు- 50 కంపెనీలు ప‌నిచేస్తున్నాయ్‌!

Aadipurush poster
ప్ర‌భాస్  సినిమా రాధేశ్యామ్ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇటీవ‌లే వాలెంటైన్ డే సంద‌ర్భంగా ఓ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. దానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా నిన్న ప్ర‌భాస్ తాజా సినిమా ఆదిపురుష్ కోసం కొత్త షెడ్యూల్ ప్రారంభించిన‌ట్లు తెలిసింది. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టెక్నిక‌ల్ వ‌ర్క్ కీల‌కంగా మార‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త హైలైట్ కాబోతుంది. 
 
పౌరాణికాల‌కు సంబంధించిన ఈ క‌థ‌లో ఫారెస్ట్ సీన్ చాలా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఫారెస్ట్‌లో వాన‌రాలు, పురాత‌కాలంనాటి దేవాల‌యాలు అక్క‌డ చూపించ‌నున్నారు. ఇందుకోసం నిర్మాత‌లు 60 కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సి.జి. వ‌ర్క్‌తోపాటు ఇత‌ర టెక్నిక‌ల్ ప‌నుల‌కోసం వివిధ దేశాల‌నుంచి టీమ్ ప‌నిచేస్తుంద‌ట‌. దీనికోసం 50 కంపెనీలు ప‌నిచేయ‌డానికి ముందుకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాను కూడా వివిధ దేశాల‌కు చెందిన టీమ్ ప‌నిచేసింది. అప్ప‌ట్లో బాహుబ‌లికి ప‌నిచేసిన టీమ్‌తోపాటు మ‌రికొంత‌మంది యాడ్ అయ్యారు. ఇప్పుడు అంత‌కుమించి వుండేలా ఆదిపురుష్ కోసం ద‌ర్శ‌కుడు ఓంరౌత్ చ‌ర్య‌లు తీసుకుంటున్నాడు. ఈ వార్త ప్ర‌భాస్ అభిమానుల‌కు జోష్ క‌ల‌గ‌చేసింది. ఈ సినిమాలో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతిస‌న‌న్ న‌టిస్తోంది. ఆగ‌స్టులో సినిమాను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.