గురువారం, 15 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (17:55 IST)

అవకాశాల కోసం ఎగబడితే అడ్వాంటేజ్ తీసుకుంటారు.. నటి ఎస్తర్

Noel - Ester
సినిమా ఇండస్ట్రీలో తొందరగా ఎదగాలనే కోరికతో ఏం చేయడానికైనా సిద్ధపడితే అడ్వాంటేజ్ తీసుకుంటారని.. తొందరగా పైకి రావాలని కోరుకునే వారికి అదే షార్ట్ కట్ అని ప్రముఖ సింగర్ నోయెల్ భార్య, నటి ఎస్తర్ నోరాన్హా అన్నారు. తాను తన టాలెంట్‌ను, హార్డ్ వర్క్‌ను నమ్ముకుంటానని ఎస్తర్ చెప్పారు. తన టాలెంట్ ద్వారా వచ్చే గుర్తింపునే కోరుకుంటానని స్పష్టం చేశారు.
 
ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఎక్కువగా జరగడానికి కారణం ఇక్కడున్న పరిస్థితులేనని ఎస్తర్ వివరించారు. అవకాశాల కోసం ఏం చేయగలవు అనే వాళ్లు వున్నారని.. దానికి తోడు అడ్వాంటేజ్ తీసుకునే వాళ్లు ఉంటారని వెల్లడించారు. కానీ వాటిని పక్కనబెట్టి వారి దారిన వారు వెళ్తే ఎవరూ బలవంత పెట్టరని, ఆ ఛాయిస్ మాత్రం ఉందని ఎస్తర్ అన్నారు.