గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (20:19 IST)

తమిళ సీక్వెల్ చిత్రంలో 'మహానటి'కి చాన్స్?? (video)

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్‌కు మరో అరుదైన అవకాశం దక్కే ఛాన్స్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు కె.భారతీరాజా దర్శకత్వంలో ఆమె నటించనుంది. గత 1978లో కమల్ హాసన్ - శ్రీదేవి జంటగా భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం సిగప్పు రోజాక్కల్ (ఎర్రగులాబీలు). ఈ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారు. ఈ ఏర్పాట్లలో భారతీరాజ తనయుడు మనోజ్ భారతీరాజా సన్నాహాలు చేస్తున్నారు. 
 
రోజాపూక్కళ్ చిత్రానికి ఇళయరాజా సంగీత బాణీలు సమకూర్చగా, విశ్వనటుడు కమల్‌హాసన్‌ సైకో పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఆ చిత్రం సెకండ్‌ పార్ట్‌ తీయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. 
 
అందమైన అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసగించి వారి శవాలను ఇంటి వెనుక గార్డెన్‌లో పూడ్చిపెట్టే సైకో కథతో 'ఎర్ర‌గులాబీలు' చిత్రాన్ని రూపొందించారు. కాగా రెండోపార్ట్‌ కోసం అమ్మాయిలను ప్రేమపేరుతో వంచించే యువకులపై హీరోయిన్‌ కక్ష తీర్చుకునే విధంగా వెరైటీ కథను తయారు చేశారు. 
 
ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె కాల్షీట్లు దొరకకపోతే సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేస్తామని మనోజ్‌ తెలిపారు.ఈ చిత్రం వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.