శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (22:29 IST)

మహేష్.. మళ్లీ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా కథలు విని ఆఖరికి గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన పరశురామ్‌తో సినిమా చేస్తున్నారు. అదే సర్కారు వారి పాట. అయితే.. దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఆర్ఆర్ఆర్ ఎప్పుడు వస్తుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆర్ఆర్ఆర్ కంప్లీట్ కావాలి.. ఆ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా స్టార్ట్ కావాలి. ఇదంతా జరగడానికి చాలా టైమ్ పడుతుంది కనుక సర్కారు వారి పాట తర్వాత మహేష్‌ బాబు మరో సినిమా చేయాలి అనుకుంటున్నారు.
 
ఆ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయాలనుకుంటున్నారని తెలిసింది. అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ చేయనున్నారు. నవంబర్ నుంచి ఎఫ్ 3 సెట్స్ పైకి వెళ్లనుంది. సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి మహేష్ బాబు కోసం స్టోరీ చేస్తారు. 2021 చివరిలో లేదా 2022లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.