సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (23:04 IST)

మలయాళంలో రీ ఎంట్రీ ఇవ్వనున్న పవన్ కల్యాణ్ హీరోయిన్.. ఎవరు..? (video)

Pawan_Meera
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోయిన్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె ఎవరంటే గుడుంబా శంకర్ హీరోయిన్. పందెంకోడి హీరోయిన్ అయిన మీరా జాస్మిన్.. దక్షిణాదిన తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో మిడిల్ రేంజ్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. 
 
తెలుగులో మీరా జాస్మిన్ భద్ర, అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, రారాజు, మహారధి, గోరింటాకు, బంగారు బాబు మరికొన్ని సినిమాల్లో నటించింది. అలాగే మీరా జాస్మిన్ మలయాళంలో నటించిన పాదమ్ ఒన్న్ ఒరు విలాపం సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు రావడం గమనార్హం. సౌత్ ఇండియా సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన మీరా జాస్మిన్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వనుంది.
 
తెలుగులో మీరాజాస్మిన్ పవన్ కళ్యాణ్ కు జోడీగా గుడుంబా శంకర్ సినిమాలో నటించగా ఆ సినిమాలో పాత్ర మీరాజాస్మిన్ కు మంచిపేరు తెచ్చిపెట్టింది. కొన్నేళ్ల క్రితం మీరా జాస్మిన్ దుబాయ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత మీరా జాస్మిన్ సినిమాలకు దూరంగా ఉంది. దుబాయ్‌లో సెటిల్ అయిన మీరా జాస్మిన్.. త్వరలో సినిమాల్లో రానుంది. 
 
తాజాగా మీరా జాస్మిన్ మలయాళ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ డైరెక్షన్ చేస్తున్న ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో మలయాళ ప్రముఖ నటుడు జయరాం కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు ఈ చిత్రంలో దేవికా సంజయ్, ఇన్నోసెంట్, శ్రీనివాసన్, సిద్దిక్ కూడా సహాయక తారాగణంలో నటించనున్నట్లు సత్యన్ అంతికాడ్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. 
 
జులై నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత మీరా జాస్మిన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటం గమనార్హం. ఇలా మలయాళంలో రీఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్ తెలుగులో కూడా కొత్త సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.