షాక్ ఇవ్వబోతున్న నాగార్జున... అసలు ఏం జరిగింది..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం మన్మథుడు 2. ఈ చిత్రానికి చి ల సౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున - జెమిని కిరణ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. సమంత అక్కినేని ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే కీర్తి సురేష్ ఓ స్పెషల్ రోల్ చేస్తుంది. మార్చి నుంచి పోర్చుగల్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. పోర్చుగల్ షెడ్యూల్ పూర్తయ్యింది. అయితే... ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
కుదరకపోతే క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో రిలీజ్ చేస్తారు అనుకోవచ్చు కానీ... నాగ్ అలా చేయడం లేదట. ఆగష్టులో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆగష్టులో సాహో రిలీజ్ ఉంటుంది. దసరాకి సైరా ఉంటుంది. డిసెంబర్ అంటే చాలా లేట్ అవుతుంది. అందుచేత జులైలోనే రిలీజ్ చేద్దాం అంటున్నాడట.
రాహుల్ రవీంద్రన్ చి ల సౌ చిత్రాన్ని నెల రోజుల్లోనే కంప్లీట్ చేసాడు. ఇప్పుడు ఈ సినిమాని కూడా తక్కువ రోజుల్లోనే కంప్లీట్ చేసాడు. ఈ విధంగా మన్మధుడు 2 చిత్రాన్ని త్వరగా రిలీజ్ చేసి నాగ్ షాక్ ఇవ్వబోతున్నాడు. మరి..రిలీజ్ ఓకే రిజెల్ట్ తో కూడా షాక్ ఇస్తారేమో చూడాలి.