గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (20:13 IST)

అందమైన భామలతో బంగార్రాజు స్టెప్పులు.. దుమ్ముదులిపే సాంగ్ రెడీ! (video)

అందమైన భామలు అంటూ పాట పాడుకున్న టాలీవుడ్ మన్మథుడు తాజాగా ముగ్గురు గ్లామర్ హీరోయిన్లతో రొమాన్స్ పండించేందుకు సిద్ధం అవుతున్నాడు. తాజాగా కింగ్ నాగార్జున బంగార్రాజు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాగార్జున, నాగ చైతన్య గతంలో ‘మనం’, ‘ప్రేమమ్’ వంటి చిత్రాలలో నటించారు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఈ మూవీ సీక్వెల్‌గా రూపొందుతోంది. 
 
ఈ రొమాంటిక్ డ్రామాలో నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో నాగార్జున ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలతో ఓ రొమాంటిక్ సాంగ్ చేయబోతున్నాడు.
 
దుమ్ముదులిపే ఈ సాంగ్ కోసం ‘బంగార్రాజు’ మేకర్స్ ఇద్దరు నటీమణులు వేదిక, మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సాంగ్‌లో నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ కలిసి స్టెప్పులేయనున్నారు. త్వరలో ‘బంగార్రాజు’ బృందం ఈ ఐటమ్ సాంగ్ కోసం ఒక ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేయనుంది.
 
మరోవైపు నాగార్జున త్వరలో బాలీవుడ్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో కనిపించనున్నాడు. ఇందులో ఆయన అతిధి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరోవైపు నాగార్జున అతను ప్రవీణ్ సత్తారుతో కలిసి "ది ఘోస్ట్" సినిమాలో నటిస్తున్నాడు.