శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 26 అక్టోబరు 2018 (21:11 IST)

నన్ను చూస్తే అందరికీ అలా అనిపిస్తుంది... ఎందుకో? రకుల్ ప్రీత్ సింగ్

సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మోడల్‌గా చేసేటప్పుడు హీరోయిన్‌గా చేయాలన్న కోరిక ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోయిన్‌లలో ఒకరుగా ఉండడం సంతోషంగా అనిపిస్తోంది. సినిమాల్లో గ్యాప్ రాకుండా చేస్తూనే ఉండాలన్నది నా ఆలోచన. కానీ ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవిగా నటించే అవకాశం వచ్చింది.
 
ఎన్టీఆర్ సినిమాలోని నా క్యారెక్టర్ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు నటించిన సినిమాలు ఒక ఎత్తయితే ఎన్టీఆర్ చిత్రంలోని నా పాత్ర మరిచిపోలేని క్యారెక్టర్‌గా మిగిలిపోతుంది. రకుల్ అంటేనే అలనాటి ప్రేక్షకులకు కూడా గుర్తిండిపోయేలా ఈ క్యారెక్టర్ ఉంటుందని అని చెబుతోంది. 
 
అంతేకాదు ఏ సినిమా అయినా వెంటనే నాపైనే ఎక్కువగా సినిమా యూనిట్ ఆధారపడుతుంది. నన్నే ఎక్కువగా కష్టపెట్టాలని చూస్తుంది. నేను అదంతా ఏమీ పట్టించుకోను. నేను నటించే ప్రతి సినిమా విజయం సాధించాలన్నదే నా తపన. అందుకోసం ఎంత కష్టాన్నయినా ఎదుర్కొంటానంటోంది రకుల్ ప్రీత్ సింగ్.