శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (13:31 IST)

పూర్ణ మార్కెట్ లో గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ తో భారీ యాక్షన్ ఎపిసోడ్ !

Ram Charan, shankar, anbariv and others
Ram Charan, shankar, anbariv and others
కథానాయకుడు రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. తమిళ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాలోని ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను నిన్న రామోజీ ఫిలింసిటీలో ఆరంభించారు. పూర్ణ మార్కెట్ పేరుతో ఉన్న మార్కెట్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. దీనికి తమిల ఫైట్ మాస్టర్లు అన్బుమణి,  అరివుమణి సారధ్యంలో జరుగుతుంది. వీరిద్దరూ అన్నదమ్ములు కావడంతో ఇద్దరి పేర్లు కలిసివచ్చేలా అన్బరివ్ అని పేరు పెట్టుకున్నారు. హెలికాప్షర్ లో దిగి వస్తున్న ఓ సన్నివేశం తర్వాత ఈ యాక్షన్ ఎపిసోడ్ వుంటుందని తెలుస్తోంది.
 
ఈ ఫైట్ మాస్టర్లు కమల్ హాసన్ సినిమాలకు పనిచేశారు. శంకర్ దర్శకత్వంలో తీసిన సినిమాలకు వారే యాక్షన్ కొరియోగ్రాఫర్లు. రామ్ చరణ్ కు తగు జాగ్రత్తలు తీసుకుని జంపింగ్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ లో ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర పాల్గొన్నారు. అంజలి నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో మరిన్ని అప్ డేట్ లు రానున్నాయి.