నిర్మాత 'దిల్' రాజుకే నో చెప్పిన హీరోయిన్?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన అతికొద్ది మంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఈమె సినిమాల్లో పాత్రల ఎంపికలో చాలా స్పష్టంగా ఉంటుంది. పైగా, పాత్ర నచ్చకపోతే.. కోట్లాది రూపాయలు ఇస్తామన్నా ఆమె అంగీకరించరు. అది ఎంత పెద్ద బ్యానర్ అయినా.. అగ్ర దర్శకుడు, బడా నిర్మాత అయినాసరే.
తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ఎదురైనట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఓ స్టార్ ప్రొడ్యూసర్ సినిమాను సాయిపల్లవి రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ఆ బడా నిర్మాత ఎవరో కాదు.. 'దిల్' రాజు. ఈ వివరాలను పరిశీలిస్తే,
దర్శకుడు అనీల్ రావిపూడి తదుపరి సినిమాను చేయడానికి సమయం పట్టేలా ఉండటంతో, మధ్యలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేశారట. ఆ చిత్రంలోని పాత్రకు సాయిపల్లవి అయితే సరిగ్గా సరిపోతుందని రాజు భావించారు. ఆ వెంటనే సాయిపల్లవిని సంప్రదిస్తే.. సాయిపల్లవి సున్నితంగా నో చెప్పేసిందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.