మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 నవంబరు 2022 (15:53 IST)

సమంత ఆరోగ్యం ఆందోళనకరంగా వుందా? దక్షిణ కొరియాకు తీసుకెళ్తున్నారా?

Samantha Ruth Prabhu
టాలీవుడ్ బ్యూటీ క్వీన్ సమంత ఆరోగ్యం ఆందోళనకరంగా వుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంతో చికిత్స కోసం ఆమెను దక్షిణ కొరియాకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 
ఐతే ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే వుందని సమంత వ్యక్తిగత కార్యదర్శి స్పష్టం చేసారు. కానీ సమంత యశోద సక్సెస్ మీట్‌కి రాలేదు. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా వుండటంలేదు. దీనితో ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

 
సమంత మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి చికిత్స కోసం ఇటీవలే అమెరికా వెళ్లి వచ్చారు. యశోద విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మాత్రం మళ్లీ కనిపించలేదు. దీనితో ఆమె ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వస్తున్నాయి.