సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (11:06 IST)

ఒకే పాత్ర హన్సికతో చేసిన 105 మినిట్స్ - పూర్తి

105 Minutes team
రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనంతో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. హన్సిక మోత్వాని కథానాయిక. సామ్ సి.యస్ సంగీతం అందించగా  కిషోర్  బొయిదాపు సినిమాటోగ్రఫీ అందించారు.ఈ సినిమా కోసం ఇంతలా తను ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ఈ సినిమా ”సింగిల్ షాట్”, “సింగిల్ క్యారెక్టర్ ”  “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్.  నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదల కు సిద్దమైన సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో హీరోయిన్ హన్సిక మోత్వాని తో పాటు చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
 
ఈ  సందర్భంగా దర్శకుడు  రాజు దుస్సా మాట్లాడుతూ, మేము అనుకున్న కాన్సెప్ట్ ను ఉన్నది వున్నట్లుగా చాలా చక్కాగా తీశాము.రవి గారు నాకు అన్ని విభాగాల్లో వుంటూ నాకు చాలా సపోర్ట్ చేశారు. .రవి గారికి చాలా థాంక్స్. హన్సిక గారి గురించి చెప్పాలంటే తాను డే వన్ నుండి షూటింగ్ అయిపోయే వరకు తను చాలా  కష్టపడింది.ప్రతి షార్ట్ ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు ఉన్నాకూడా నో అనకుండా చేసింది.  మేము సింగల్ షార్ట్ లో చేస్తే హన్సిక గారు ప్రతి షార్ట్ సింగల్ టేక్ లో చేశారు..అలా చేసినందుకే సినిమా తొందరగా పూర్తి చేశాము. అందుకు హన్సిక గారికి ధన్యవాదాలు. యూనిట్ సబ్యులందరూ మేము చేసే ప్రతి పనికి  చాలా సపోర్ట్ చేసి మాకు సహకరించారు.
 
హన్సిక మోత్వాని మాట్లాడుతూ, నా కెరీర్ లో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలలోకి  ఈ సినిమా చాలా టప్ గా అనిపించింది. దర్శకుడు నాకు ఎం చెప్పాడో అదే ఉన్నది ఉన్నట్లు చాలా చక్కగా తీశాడు. నిర్మాతలు మంచి కథను సెలెక్ట్ చేసుకొని ఎక్సపెరర్మెంటల్ గా తీశారు. కెరారామెన్‌ కిశోర్, రవి గార్లు నేను ఇరవై నిమిషాల రెయిన్ షాట్ ఉన్నాకూడా వారు నాతో ఉండి అద్భుతంగా చేశారు. టీం అంతా చాలా కష్టపడి పని చేసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించి దర్శక,నిర్మాతలకు, చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు.
 
నిర్మాత బొమ్మక్ శివ మాట్లాడుతూ, మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకున్న  మేము  ఇంత తొందరగా సినిమా షూట్ పూర్తి చేస్తాము అనుకోలేదు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసిన హన్సిక స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి కూడా తను ఎంతో డెడికేటెడ్ గా దర్శకుడు చెప్పిన ప్రతి షార్ట్ కూడా సింగల్  టేక్ లో  చేయడం వలన మేము ఈ సినిమాను కేవలం ఆరు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాము.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో పప్రేక్షకుల ముందుకు వస్తున్న మా "105 మినిట్స్" చిత్రం ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న  చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుతూ ఇలాంటి మంచి సినిమాలో మమ్మల్ని భాగస్వామ్యులగా చేసిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు తెలిపారు..