మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (16:14 IST)

మంచు విష్ణు ఆవిష్క‌రించిన మిస్టేక్ చిత్రంలోని అభినవ్ సర్దార్ లుక్

Mistake- Abhinav Sardar
క‌థానాయ‌కుడు అభినవ్ సర్దార్ `రామ్ అసుర్' సినిమాలో సూరి పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. హీరోగా చేస్తూనే నిర్మాతగా కూడా సక్సెస్‌ఫుల్ సినిమాల రూపకల్పనలో భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే 'మిస్టేక్' అనే మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అభినవ్ సర్దార్. తాజాగా ఈ సినిమా నుంచి అభినవ్ లుక్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా మా అధ్యక్షుడు మంచు విష్ణు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై హైప్ పెంచేసింది. 
 
మిస్టేక్ పోస్టర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపిన మంచు విష్ణు.. ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని పేర్కొన్నారు. నా స్నేహితుడు అభినవ్ సర్ధార్, మిస్టేక్ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు అని అన్నారు మంచు విష్ణు. 
 
ASP మీడియా ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్. 2గా రాబోతున్న 'మిస్టేక్' మూవీకి సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తూనే నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ విలక్షణ కథను ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు చిత్ర ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
 
ఈ పోస్టర్‌లో సిక్స్ ప్యాక్ బాడీతో శతృమూకలను చితగ్గొట్టే సీరియస్ లుక్‌తో కనిపించారు అభినవ్ సర్దార్. ఈ లుక్ చూస్తుంటే 'మిస్టేక్' సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని, కమర్షియల్ హంగులతో గ్రాండ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టమవుతోంది. 'లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ విత్ న్యూ మిస్టేక్స్' అంటూ పోస్టర్‌పై రాసిన లైన్ సినిమా పట్ల క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన మిస్టేక్ అప్‌డేట్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచేయగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.
 
అడ్వెంచర్ కాన్సెప్ట్‌కి నేటితరం కోరుకునే విధంగా రొమాంటిక్ యాంగిల్ యాడ్ చేసి సస్పెన్స్, అడ్వెంచరస్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్‌గా చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ‘గంటా గ్రహచారం’ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. అలాగే VVIT కళాశాలలో సుమారు 4వేల మంది విద్యార్ధుల నడుమ విడుదల చేసిన సెకండ్ సాంగ్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ మిస్టేక్ చిత్రంలో సుజిత్ కుమార్, అజయ్ కతుర్వార్, తేజా అయినంపూడి, కరిష్మా కుమార్, తాన్యా, ప్రియ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.