గురువారం, 13 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (12:00 IST)

అలియా భట్‌ బర్త్‌డే స్పెషల్ .. బిటౌన్‌లో అగ్రహీరోయిన్..?

RRR Sita
అలియా భట్.. మహేశ్ భట్ వారసులిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి వరుస విజయాలతో తనను తాను నిరూపించుకుంటున్న హీరోయిన్. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, చలాకీ నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ''ఆర్ఆర్ఆర్'' సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికీ వరకు బీటౌన్‏లో చిన్న హీరోలతోపాటు... అగ్రహీరోలందరితోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. 
 
మార్చి 15న బాలీవుడ్ దిగ్గజ నిర్మాత- దర్శకుడు మహేష్ భట్ అందాల తనయ అలియా భట్ పుట్టిన రోజు. అలియాభట్ 1993 మార్చి 15న ముంబైలో జన్మించింది. సోనీ రజ్జాన్, మహేష్ భట్ దంపతుల కుమార్తె అలియా. ఆమె తల్లి యూకే మహిళ కావడం వలన అలియాకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది. 
alia bhatt
 
బాలీవుడ్ నిర్మాత- దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో అలియా హీరోయిన్‏గా నటించింది. 2012లో విడుదలైన ఈ సినిమాలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించారు. ప్రస్తుతం అలియా గంగుబాయి కతియావాడి, బ్రహ్మస్త్రా, ఆర్ఆర్ఆర్, సడక్-2, తఖ్త్, ఇన్షల్లా సినిమాల్లో నటిస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇటు టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. 
Alia Bhatt
 
రోజూ న్యూస్ పేపర్స్ చదవడం.. తనని తాను మరింత్ అప్ డేట్ చేసుకోవడానికి అలియా ఇష్టపడుతుంది. అలాగే.. రోజూ తన ఇంటి దగ్గర జాగింగ్ చేయడంతోపాటు పచ్చని పరిసరాలంటే కూడా అలియాకు ఇష్టం.
 
2013లో టైమ్స్ ఇండియా ఫిల్మ్ అవార్డులలో అలియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రానికి గానూ బెస్ట్ ఫీమేల్ డిబ్యూట్ అవార్డ్ అందుకుంది. అలాగే 2015లో హైవే చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది. 2017లో ఉడ్తా పంజాబ్ సినిమాకు గానూ.. ఫిలింఫేర్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. దాదాపు 15 సినిమాల వరకు నటించిన ఈమె అగ్రహీరోయిన్‌గా ముద్ర వేసుకుంది. 
 
ఇకపోతే... ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో "ఆర్‌ఆర్‌ఆర్‌" తెరకెక్కుతోంది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అలియా భట్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తున్న చెర్రీకి జోడీకి సీత పాత్రలో నటిస్తోంది.

సీతగా ఆమె ఎలా వుంటుందో.. ఆమె పుట్టిన రోజు సందర్భంగా లుక్ విడుదల చేశారు. ఇందులో శ్రీరాముడి విగ్రహానికి అలియా పూజ చేస్తున్నట్లుంది, షేడ్‌లో ఉన్న ఈ ఫోటోలు ఫస్ట్ లుక్‌ని ప్రతిబింబిస్తుంది. ఆనాటి డ్రెస్సింగ్‌లో అలియా కనిపించనున్నట్టు తెలుస్తోంది.