శనివారం, 2 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (16:35 IST)

నెటిజ‌న్ల రియాక్షన్‌కు అన‌సూయ కౌంట‌ర్‌

Anasuya,
అంత‌ర్జాతీయ మహిళా దినోత్సవం సంద‌ర్భంగా నేడు సినీ ప్ర‌ముఖుల‌కు అన‌సూయ శుభాకాంక్ష‌లు తెలిపింది. అయితే ఆమె పెట్టిన పోస్ట్‌కు నెటిజ‌న్లు ఘాటుగానే స్పందించారు. మహిళా దినోత్సవాన్ని అనసూయ ఫూల్స్‌డే అని మెన్షన్ చేయడమే దీనికి కారణం. ఒక్క‌రోజుతోనే మ‌హిళా దినోత్స‌వం పూర్త‌వుతుంది. త‌ర్వాత మ‌ళ్ళీ మామూలే అన్న మీనింగ్ ఆమె పెట్టిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అయితే దీనికి నెటిజ‌న్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
 
మహిళల్ని గౌరవించే రోజు ఇది. 24 గంటల్లో ముగుస్తుంది. కాబట్టి మహిళలందరూ మినహాయిస్తే.. హ్యాపీ ఫ్యూల్స్‌డే. గుమ్మడికాయ దొంగల్ని కామెంట్స్‌లో చూడొచ్చు’... అని అనసూయ పేర్కొంది. ‘మగవాళ్లు ఎప్పుడూ ఆడవారికి గౌరవం ఇస్తారు. మీ లిమిట్స్ లో మీరుంటే మంచిది. ఇలా గుడ్డిగా ట్వీట్లు పెట్టకండి’  అంటూ ఆమెకు ప‌లువురు ప‌లుర‌కాలుగా స్పందించారు.  ‘ఆడవాళ్ళ రెస్పెక్ట్ గురించి మీ జబర్దస్త్ వాళ్ళే మాట్లాడాలి. అంటూ తీవ్ర‌స్థాయిలో కౌంట‌ర్లు వేశారు.
 
ఇన్ని కౌంట‌ర్లు ప‌రిశీలించిన త‌ర్వాత గ‌త్యంత‌రం లేక తిరిగి అన‌సూయ చిత్ర‌మైనరీతిలో వివ‌ర‌ణ ఇచ్చింది. ఫారిన్ యాక్సెంట్‌తో మాట్లాడుతూ, చిత్ర‌మైన క‌ళ్ళ‌జోడు పెట్టుకుని `ఇఫ్ యు డోంట్ లైక్ మీ ద‌ట్స్ ఫైన్‌. అండ్ ఐ రెస్పెక్ట్ వాట్ యువ‌ర్ టేస్ట్‌` అంటూ చిత్రంగా చ‌ప్ప‌ట్లు కొడుతూ స్పందించింది. అయితే చివ‌రిగా ఆమె ఇలా ఫారిన్ యాస‌లో మాట్లాడ‌డం కూడా వైల‌ర్ అవుతోంది.