శనివారం, 2 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (15:52 IST)

కార్తికేయ 2 నుంచి కృష్ణ ఈజ్ ట్రూత్ హ్యాష్ ట్యాగ్ విడుదల చేసిన అనుపమ్ ఖేర్

Nikhil, Anupam Kher and others
Nikhil, Anupam Kher and others
ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వస్తున్న సినిమా కార్తికేయ‌ 2. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆగస్ట్ 12న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
తాజాగా సినిమాలోని కృష్ణ ఈజ్ ట్రూత్  అనే హ్యాష్ ట్యాగ్‌ను బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ విడుదల చేసారు. సినిమాలో ఈయన కూడా అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ కృష్ణుడి తత్వం గురించే ఈ సినిమా కథ అంతా సాగుతుందని ఇదివరకే చెప్పారు మేకర్స్.
 
నటీనటులు: 
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు
 
టెక్నికల్ టీం: 
క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం - చందు మెుండేటి
బ్యాన‌ర్:  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌
కొ-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్లనిర్మాత‌లు: టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్