గురువారం, 8 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: గురువారం, 19 జనవరి 2023 (13:36 IST)

అల్లుడు స్టెప్‌ను ఫాలో అయిన అత్త, కోడలు ఫిదా

Shobhana Kamineni dance
Shobhana Kamineni dance
అల్లుడుకు పేరొస్తే అత్తకు కూడా ఆనందమేకదా. ఇప్పుడు ఆ ఆనందాన్ని రామ్‌చరణ్‌ అత్తగారు అనుభవిస్తున్నారు. ఇటీవలే రామ్‌చరణ్‌, ఎన్‌.టి.ఆర్‌. నటించిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపట్ల ఆమె ఆనందాన్ని వ్యక్తం చేయడమేకాకుండా చిన్న స్టెప్‌ కూడా వేశారు. ఈ స్టెప్‌ వేసే చిన్న వీడియోను ఉపాసన తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తన తల్లి శోభనా కామినేని స్టెప్‌ వేయడం నాకూ మరింత ఆనందంగా ఉందంటూ,  ఐ లవ్‌ యూ మా.. అంటూ పోస్ట్‌ చేసింది.
 
ఇప్పటికే చిరంజీవి కుటుంబం ఎంతో హ్యాపీగా ఫీలవుతూ పోస్ట్‌లు పెట్టారు. కాస్త ఆలస్యమైనా ఉపాసన కుటుంబ సభ్యులు కూడా పెట్టడంతో అన్నీ శుభాలే అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. త్వరలో ఉపాసన తల్లికాబోతోంది. ఆ మాతృత్వ ఆనందాన్ని ఆమె అనుభవిస్తూ ఇలా మరో ఆనందాన్ని వ్యక్తం చేయడం పట్ల తన కుమార్తెకు థ్యాంక్‌ యూ డాలింగ్‌ అంటూ శోభన కామినేటి బదులిచ్చింది. మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు.