మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (20:20 IST)

బిగ్‌బాస్‌ హౌజ్‌లో మోనాల్, అఖిల్ రొమాన్స్.. రేటింగ్‌కు రెక్కలొస్తాయా? (video)

Monal Gajjar
బిగ్ బాస్ రియాలిటీ షో ఆరోవారంలోకి ప్రవేశించింది. అలాగే బిగ్‌బాస్‌ హౌజ్‌లో మోనాల్, అఖిల్ రొమాన్స్ పండుతోంది. దీంతో బిగ్ బాస్-4కు రేటింగ్ అమాంతం పెరిగిపోయే ఛాన్సుందని సినీ పండితులు అంటున్నారు. 
 
బిగ్‌బాస్‌ హౌజ్‌లో సోమవారం నాటి ఎపిసోడ్‌లో అభిజిత్ బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అరియానా స్పెషల్ కేక్ తయారుచేసి కట్ చేయించింది. అయితే ఇంటి సభ్యులంతా ఈ కేక్ కటింగ్‌కి వచ్చినా అఖిల్ మాత్రం దూరంగానే ఉన్నాడు. మోనాల్ కూడా ఏదో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.
 
ఇదిలా ఉంటే మరోవైపు మోనాల్‌కి హెల్త్ బాలేదని, సెలైన్లు ఎక్కించినట్లు బిగ్‌బాస్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో ఉదయాన్నే మోనాల్‌ దగ్గరకు వెళ్లాడు అఖిల్‌. ఆమె చేతికి ఉన్న సూదిని చూసి తెగ ఫీల్ అయ్యాడు. ఇక మోనాల్‌ ఎప్పటిలాగే అఖిల్‌ని తనవైపుకు లాక్కొని గట్టి హగ్‌ ఇచ్చింది. 
 
అయితే గత వారం నామినేషన్‌ సమయంలో ఇదంతా నేషనల్ టెలివిజన్‌లో టెలికాస్ట్‌ అవుతుంది, నా కారెక్టర్‌ని బ్యాడ్ చేయకండి, నా పరువు తీయకండి అని వ్యాఖ్యలు చేసిన మోనాల్‌.. అఖిల్‌తో మాత్రం రొమాన్స్ ఆపడం లేదు. 
 
36వ రోజు పరిస్థితి చాలా గంభీరంగా మారింది. ఇంటి సభ్యుల మధ్య నెమ్మదిగా కొన్నికొన్ని విషయాలలో బేధాభిప్రాయాలు మొదలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియలో సభ్యుల మధ్య వాదోపవాదాలు ఈ వారం కూడా గట్టిగా చోటుచేసుకున్నాయి. ఇక ఈ అనూహ్య పరిస్థితుల్లో మోనాల్ గజ్జర్ ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఆమెకు చికిత్స చేశారు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే అభిజిత్ మోనాల్‌ని నిలదీసిన సంగతి తెలిసిందే. నాగార్జున ముందు అఖిల్‌తో పాటు తనను కూడా తప్పుబట్టడం తనకు నచ్చలేదని అభిజిత్ చెప్పాడు. ఇక మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే చాలా మంచిగా ఉంటుందని తెలిపాడు. అయితే నా విషయంలో నీ అభిప్రాయం ఏమిటో చెప్పమని అడిగినప్పుడు ఆమె ఆలోచించి చెబుతాను అని అంది.
 
ఆ తర్వాత.. మోనాల్ గుడ్ మార్నింగ్, హాయ్ అని చెబితే ఓకేనా అని అడిగితే కొంచెం టైం ఇస్తే ఆలోచించుకుని చెపుతానని అభి అన్నాడు. ఇక అతనితో వాగ్వాదం జరిగిన తర్వాత మోనాల్ చాలా మనస్తాపానికి గురి అయింది. దాంతో ఆమె మానసికంగా బాగా ఆందోళన చెందినట్లు కనిపించింది. అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు చికిత్స అందించారు.
 
ఆమెకి సెలైన్ ఎక్కించినట్లు బిగ్ బాస్ చెప్పారు. అలా బాగోలేని మోనాల్‌కి అఖిల్ ముద్దు పెడుతూ కనిపించాడు. ఈ దెబ్బతో మోనాల్ అభిజిత్‌కి దూరం అయినట్లే అని అనుకుంటున్నారు. మొదటి నుండి ఆమెకు అఖిల్ అంటేనే ఇష్టం ఉన్నట్లు.. ఏదో మొహమాటానికి అభిజిత్‌తో మాట్లాడుతున్నట్లు అందరూ అభిప్రాయపడుతున్నారు.
 
బిగ్ బాస్ సీజన్ 4లో క్రేజీ కంటెస్టంట్స్‌లో ఒకరు గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్. తెలుగు ప్రేక్షకులను హీరోయిన్‌గా పరిచయమైన ఈ అమ్మడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టంట్‌గా వచ్చింది. హౌజ్‌లో ఓ ఇద్దరు కంటెస్టంట్స్ మోనాల్ వల్ల గొడవలు పడుతున్న సంగతి తెలిసిందే. అఫ్కోర్స్ ఆ ఇద్దరు అఖిల్, అభిజిత్ అని అందరికి తెలుసనుకోండి. అఖిల్, మోనాల్ రాసుకుపూసుకు తిరుగుతున్నారు. వారిద్దరి రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉంది.
 
ఇక మరోపక్క అభిజిత్‌తో కూడా మోనాల్ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. అంతేకాదు అభిజిత్‌కు ఐ లైక్ యు అని కూడా చెప్పింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా నడుస్తున్న బిగ్ బాస్ హౌజ్‌లో మోనాల్ వల్ల అభిజిత్, అఖిల్ గొడవ పడుతున్నారు. ఆమె ముందు హీరోగా నిలబడాలని ఇద్దరు తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే మండే ఎపిసోడ్‌లో నామినేషన్స్ ఉంటాయని తెలిసిందే. ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా అభిజిత్, అఖిల్‌ల మధ్య వాదన జరిగినట్టు ప్రోమోలో తెలుస్తుంది.
 
ఇక మరో పక్క మోనాల్‌కు నామినేట్ చేసేందుకు వేయాల్సిన మిర్చి దండ ఆమె మెడలో వేశారు. అయితే ప్రోమోలో గమనిస్తే మోనాల్ చేతికి క్యాన్లా ఉంది. ఆమె మెడలో దండలని సరిచేసుకుంటున్న టైంలో క్యాన్లా కనిపించింది. ఇంతాకీ మోనాల్‌కు ఏమైంది.. నీరసంగా ఉందని మోనాల్‌కు సెలైన్ ఎక్కించారా లేక ఆమెకు ఏమైనా అయ్యిందా అని ఆడియెన్స్ డౌట్ పడుతున్నారు. 
 
ఆదివారం ఎపిసోడ్‌లో కూడా మోనాల్ ఇప్పుడు అంతా ఓకేనా అని హెల్త్ గురించి నాగార్జున అడిగినట్టు అనిపించింది. సో హౌజ్‌లో మోనాల్ సిక్ అయినట్టు తెలుస్తుంది. ఈ వారం కూడా ఆమె నామినేషన్స్‌లో ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి.