ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (10:25 IST)

చిరంజీవి "ఆచార్య" టీజర్ రిలీజ్ తేదీ ప్రకటన

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్తను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నెల 29వ తేదీ శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు ఆచార్య టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను తయారు చేసి విడుదల చేసింది. 
 
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్‌ కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 
 
ఈ సినిమాలో చెర్రీ 'సిద్ధ' పాత్రలో కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్‌తో అన్ని హంగులతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 
 
కాగా, ఇదే అంశంపై చిరంజీవి, కొరటాల శివల మధ్య ఓ ఫన్నీ సంభాషణను చిత్ర యూనిట్ మంగళవారం పోస్ట్ చేసింది. ఆచార్య టీజర్‌ను రిలీజ్ చేయకుంటే తానే లీక్ చేస్తానంటూ చిరంజీవి కొంటెగా హెచ్చరిస్తే... దీనికి దర్శకుడు కొరటాల సమాధానిచ్చిన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగా శుక్రవారం ఈ టీజర్‌ను రిలీజ్ తేదీని ప్రకటించారు.