శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 జులై 2021 (16:03 IST)

'కైకాల' నివాసంలో చిరంజీవి దంపతులు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులు ఆదివారం వెళ్లారు. కైకాల పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనుక శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
 
'తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు' అంటూ కొనియాడారు. కైకాల సత్యనారాయణ తనకు ఎంతో ఆప్తుడని వ్యాఖ్యానించారు. ఆదివారం సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.