ఆదివారం, 3 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (09:20 IST)

విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆత్మహత్య.. చున్నీతో ఉరేసుకుని..

Vijay Antony
Vijay Antony
ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆత్మహత్యకు పాల్పడింది. విజయ్ ఆంటోనీ 16 ఏళ్ల కుమార్తె మీరా మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. చర్చ్ పార్క్ స్కూల్‌లో మీరా పన్నెండో తరగతి చదువుతోంది. 
 
తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంట్లో దుపట్టాతో ఉరివేసుకుంది. దీన్ని కుటుంబ సభ్యులు వెంటనే కావేరీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మీరా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
 
మీరా ఆత్మహత్యకు ఒత్తిడే కారణమని తెలుస్తోంది. డిప్రెషన్ కోసం ఆమె చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. కుమార్తె ఆత్మహత్య సమయంలో ఆంటోనీ ఇంట్లో లేరని సమాచారం.