సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2022 (19:21 IST)

"వాల్తేరు వీరయ్య" మూవీపై అప్‌డేట్ ఇచ్చిన డీఎస్పీ

devisriprasad
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "వాల్తేరు వీరయ్య". సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రం చివరి దశ నిర్మాణ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ నేథ్యంలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఇది మెగా అభిమానులను ఖుషి చేసేలా ఉంది. 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో ఫస్ట్ సాంగ్‌ను ఇపుడే చూశాని, చిరు ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేశారని, ఈ ఫస్ట్ సింగిల్ ఈ వారంలో వస్తుందంటూ ట్వీట్ చేశారు. 
 
ఈ వార్తను లీక్ చేయకుండా తనను తాను నియంత్రించుకోలేక పోతున్నానని తెలిపారు. 'వాల్తేరు వీరయ్య' నుంచి ఫస్ట్ సింగిల్‌ ఈ వారంలో రిలీజ్ అవుతుందని తెలిపారు. అభిమానులూ పార్టీకి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే ఇది బాస్ పార్టీ అని దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. 
 
కాగా, ఈ పాట సినిమాలో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్‌ అని తెలుస్తుంది. ఈ హుషారైన పాటలో మెగాస్టార్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా నటించారు. ఈ పాటను ఇటీవలే హైదరాబాద్ నగరంలోని శివారుల్లో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరించారు.