గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (19:03 IST)

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

Diamond Colony 2 poster
Diamond Colony 2 poster
100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్‌ మినిట్స్ తో జీ 5లో హిస్టరీ క్రియేట్‌ చేస్తోంది డీమాంటే కాలనీ 2. దాదాపు దశాబ్దం క్రితం విడుదలైన డీమాంటే కాలనీ అద్భుతమైన విజయం సాధించింది. హారర్‌ కామెడీ విభాగంలో సరికొత్త ఒరవడికి తెరదీసింది. ఓ వైపు భయపెడుతూనే, నవ్వులు కురిపించి, ఈ జోనర్‌కి ప్రత్యేకమైన ప్రేక్షకులను క్రియేట్‌ చేసింది. అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ సినిమాలో అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్‌ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. మొదటి భాగం ఎక్కడ ఆగిందో, సరిగ్గా అక్కడి నుంచే రెండో భాగాన్ని స్టార్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం జీ5లో ప్రదర్శితమవుతోంది డీమాంటే కాలనీ2.
 
సాహసాలను ఇష్టపడే నలుగురు స్నేహితులు - శ్రీనివాసన్‌, విమల్‌, రాఘవన్‌, సాజిత్‌.. థ్రిల్‌ని ఇష్టపడే ఈ నలుగురూ డీమాంటే కాలనీలోని ఓ మేన్షన్‌కి వెళ్తారు. 19వ శతాబ్దంలో ధనికుడైన పోర్చుగీస్‌ బిజినెస్‌మేన్‌ జాన్‌ డీమాంటేకి చెందిన మేన్షన్‌ అది. అయితే అక్కడ పారానార్మల్‌ యాక్టివిటీస్‌ ఉంటాయి. ఎందరి శాపాలకో గురయి ఉంటుంది.  దాని వల్ల పలు రకాల ఇబ్బందులకు గురయి ఉంటాడు అతను. అలాంటి వ్యక్తికి చెందిన మేన్షన్‌కి వెళ్లిన నలుగురికి ఏమయింది? అక్కడ ఇరుక్కున్న ఆ నలుగురికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వాటి నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? అనే కథాంశంతో తెరకెక్కింది.
 
డీమాంటే కాలనీ2కి వస్తున్న అద్భుతమైన స్పందనకు ఆనందం వ్యక్తం చేశారు డైరక్టర్‌ అజయ్‌ జ్ఞానముత్తు. ఆయన మాట్లాడుతూ '' జీ5లో డీమాంటే కాలనీ2 వరల్డ్ డిజిటల్‌ ప్రీమియర్‌కి వచ్చిన స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. 100 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్ గురించి వినగానే చాలా ఆనందంగా అనిపించింది. ఈ హారర్‌ కామెడీ జీ 5లో అద్భుతంగా మెప్పిస్తోంది. అరుళ్‌నిధి, ప్రియా భవానీ శంకర్‌ నటన గురించి తప్పక ప్రస్తావించాలి. ఇలాంటి జానర్‌కి ఇంత మంది అభిమానులుండటం చాలా గొప్ప విషయం. ఇది జస్ట్ బిగినింగ్‌ మాత్రమే. ఇక్కడి నుంచి ఎంతెంత దూరం ప్రయాణిస్తామో మాటల్లో చెప్పలేం'' అని అన్నారు.
 
అరుళ్‌నిధి మాట్లాడుతూ ''అమేజింగ్‌ థియేట్రికల్‌ రన్‌ చూసిన సినిమా డీమాంటే కాలనీ2. ఇప్పుడు వరల్డ్ డిజిటల్‌ ప్రీమియర్‌లో జీ5లో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ దాటడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో మాతో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మా ప్రాజెక్ట్ మెప్పిస్తోంది. ప్రేమతో, అభిమానంతో ఫ్యాన్స్ పంపిస్తున్న సందేశాలు చూస్తుంటే సంబరంగా ఉంది. ఇలాంటి గొప్ప ఆదరణ చూస్తుంటే నమ్మలేని నిజంలాగా ఉంది'' అని అన్నారు.