మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (17:39 IST)

దర్శకుల శైలి మారాలంటున్న డింపుల్‌ హయాతి

Dimple Hayati
Dimple Hayati
గల్ఫ్‌ అనే సినిమాతో తెలుగులో నటిగా ఎంటర్‌ అయిన డింపుల్‌ హయాతి ఆ తర్వాత మరలా మూడేళ్ళకు సామాన్యుడు, అభినేత్రి2 చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత రవితేజతో ఖిలాడి సినిమాలో నటించింది. ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధమయిన ఈమెకు ఆ సినీమాతో మంచి అవకాశాలు వస్తాయని భావించింది. ఏమయిందో ఏమోకానీ మరలా రవితేజ సినీమాలో నటిస్తోంది.
 
తాజాగా మహిళలను ఉద్దేశించి డింపుల్‌ హయాతి ఓ కామెంట్‌ చేసింది. సినీమా, సమాజం రెండిటిని మిళితం చేస్తూ ఆమె చేసిన కామెంట్‌ ఆలోచించేలా వుంది. సమాజంలోనూ, సినీమాలోనూ ఎక్కడైనా మహిళ చుట్టూనే విషయాలు తిరుగుతుంటాయి. సమాజంలో మహిళ పాత్ర ఎలా వుంటుందో సినీమాలోనూ అలానే వుంటుంది. సినీమాలో కాస్త సహజంకోసం అతి అయినట్లుగా చూపించినా బయట ఇలానే వుంటారుకదా అనిపిస్తుంది. అయితే ఈ విషయంలో దర్శకుల శైలి మరింత మారాలి. పురుషుల చుట్టూనే కథ తిరగడం, మహిళ పాత్ర పరిమితం కాకుండా వుంటే బాగుంటుందని సూచించింది. మరి ఆమె మాట అమలు చేస్తారా, చూడాలి.