సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 29 జనవరి 2023 (10:12 IST)

హీరో నాగ చైతన్యపై క్రష్ ఉంది... హీరోయిన్ దివ్యాంశ కౌశిక

DivyanshaKaushik
హీరో నాగచైతన్యను హీరోయిన దివ్యాంశ కౌశిక్ వివాహం చేసుకోబుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై కౌశిక్ స్పందించారు. నాగ చైతన్య చాలా బాగా, అందంగా ఉంటారన్నారు. అందుకే అతనికి ఐ లవ్ యూ చెప్పానని, అతనిపై క్రష్ ఉందన్నారు.
 
కాగా, హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య.. ప్రస్తుతం వారిద్దరూ విడిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నాగ చైతన్య పలువురు హీరోయిన్లతో రిలేషన్లలో ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా, తొలుత శోభిత ధూళిపాళ్ల, ఇపుడు దివ్యాంశ కౌసిక్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వీటిపై దివ్యాంశ కౌశిక్ స్పందించారు. "నాగ చైతన్య చాలా బాగా ఉంటారు. ఐలవ్ చై అని చెప్పింది. అతనిపై క్రష్ ఉందని, అయితే, తాను పెళ్లి చేసుకోబోతున్నామనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. రవితేజ నటించిన "రామారావు ఆన్ డ్యూటీ" చిత్రంలో తనకు హీరోయిన్‌గా అవకాశం రావడానికి కారణం చైతూనే కారణమనే వార్తల్లో కూడా ఏమాత్రం నిజం లేదన్నారు. కాగా, నాగ చైతన్య - దివ్యాంశ కౌశిక్ కలిసి "మజిలి" చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.