సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్బంగా G.O.A.T టైటిల్ ఫస్ట్ లుక్
లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ పై సుడిగాలి సుధీర్, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా పాగల్ ఫేమ్ దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మరియు బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "G.O.A.T" Tagline :GreatestOfAllTimes సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను గ్రాండ్ గా విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ రోజు సుడిగాలి సుధీర్ బర్త్ డే రోజున మా "GOAT" సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాండ్ రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమాకు తగ్గట్టే లియో మంచి మ్యూజిక్ అందిస్తున్నాడు. మంచి కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ సపోర్ట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు..
దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ... ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా షూటింగ్ విషయంలో మాకు ఏది కావాలన్నా బడ్జెట్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.హీరో, హీరోయిన్ లు ఇద్దరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు.లియో మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు.మంచి కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.