శుక్రవారం, 4 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 3 జులై 2025 (12:22 IST)

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

Fish venkat at hospital
Fish venkat at hospital
తెలుగు సినిమాల్లో పలు కేరెక్టర్ ఆర్టిస్టుగా నటించిన నటుడు  ఫిష్​ వెంకట్​ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో నటుడికి వైద్యులు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నారు. గతంలో కొన్నిరోజులు ఆసుపత్రిలో వున్నారు. ఆయన గురించి తెలిసిన కొందరు అతనికి సాయం అందించారు. 
 
రామ్ నగర్ లోని ఫిష్ మార్కెట్ లో వ్యాపారం చేసే వెంకట్.. సినిమాల్లోకి రావడంతో షిఫ్ వెంకట్ గా మారిపోయాడు. వందల సినిమాల్లో నటించిన ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గత​ కొన్ని నెలల క్రితమే చికిత్స ​ చేయించుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఎవరినీ గుర్తుపట్టేలేనంతగా అనారోగ్యంతో బాధపడుతున్నారని సంబందీకులు తెలియజేస్తున్నారు. గతంలోనే ఆయన కుడికాలికి చికిత్సకు గాయమైంది. షుగర్ బాగా వుండడంతో త్వరలో కాలు తీసేయాల్సిన అవసరం వుందని  డాక్టర్లు చెప్పినట్లు వెంకట్ తెలిపారు.
 
ఫిష్ వెంకట్‌ ఫ్యామిలీ ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. తాజాగా ఆయన ఆసుపత్రి పాలు కావడంతో తమను ఆదుకోవాలని వెంకట్ భార్య వేడుకుంటున్నారు. ఎవరైనా దాతలు అండగా నిలవాలని ఆయన భార్యతోపాటు కూతురు దయార్థ హృదయంతో అర్థిస్తున్నారు.
 
గతంలోనే పవన్​ కల్యాణ్ ఆర్థిక​ సాయం
గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వెంకట్​ వైద్యం చేయించుకున్నారు. అప్పుడు ఆయన పరిస్థితిని తెలుసుకున్న పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.