బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 ఆగస్టు 2021 (15:40 IST)

సత్యదేవ్ "హబీబ్" నుంచి పాట రిలీజ్

టాలీవుడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న తాజా హిందీ చిత్రం 'హబీబ్'. ఈ సినిమా నుంచి ఓ కొత్త సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని ఎమోషనల్ డ్రామాగా జెన్నీఫర్‌ రూపొందిస్తున్నారు. 
 
ఓ ఇండియన్‌ ఆర్మీ అధికారి, కనపడకుండాపోయిన తన కొడుకు గౌతమ్‌ని వెతుక్కుంటూ అఫ్గానిస్థాన్‌ చేరుకోవడం.. కొడుకుతో పాటు బానిసలుగా బ్రతుకున్న ఎంతోమందికి స్వేచ్ఛనివ్వడం.. వంటి ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కుతుంది. 
 
ఈ చిత్రం నుంచి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తొలి పాటను రిలీజ్ చేశారు. హృదయాలను హత్తుకుంటున్న ఈ సాంగ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో సత్యదేవ్ లుక్ కూడా చాలా డిఫ్రెంట్‌గా ఉంది. ఇక ఈ సినిమాకి జయ ఫణికృష్ణ స్వరాలు అందిస్తున్నారు.