1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 2 మే 2024 (16:59 IST)

ఏడేళ్లకే నన్ను లైంగికంగా వేధించాడు, ఇప్పుడు కాళ్లు పట్టుకున్నాడు: బాలీవుడ్ నటి

Manini De
లైంగిక వేధింపులు. తనకు ఏడేళ్ల వయసు వున్నప్పుడు తన దగ్గరి బంధువు ఒకరు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ షాకింగ్ విషయం బయటపెట్టంది బాలీవుడ్ నటి మణిని. ఈమె ఫ్యాషన్, క్రిష్ తదితర చిత్రాలతో బాగా పాపులర్ అయ్యింది. అంతేకాదు... థెరపిస్టుగా కూడా ఆమెకు మంచి పేరున్నది.
 
తనకు చిన్నప్పుడు జరిగిన చేదు అనుభవం గురించి చెబుతూ... నా చిన్నప్పుడే తమ దగ్గరి బంధువు లైంగికంగా వేధించాడు. ఆ ఘటనతో నేను చాలా మానసిక క్షోభకు గురయ్యాను. బయటపడేందుకు చాలా టైం పట్టింది. ఆరేళ్ల క్రితం ఆ వ్యక్తి తిరిగి నా వద్దకు వచ్చి క్షమాపణలు చెబుతూ కాళ్లు పట్టుకున్నాడు. ఐతే దారుణం చేసి కాళ్లు పట్టుకుంటే చేసిన తప్పు మాసిపోతుందా... అందుకే నేను అతడిని క్షమించలేకపోయాను. ప్రస్తుతం అతడు పక్షవాతం వచ్చి మంచంలో పడ్డాడు. పాపం చేసినవారికి దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు. అదే అతను అనుభవిస్తున్నాడు అని చెప్పుకొచ్చింది.