మంగళవారం, 3 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (16:33 IST)

జబదర్‌ దస్త్ గతమే బాగుంది ఇప్పడు దిష్టి తగిలిందంటున్న అదిరే అభి

adire Abhi post
adire Abhi post
ప్రముఖ టీవీ ఛానల్‌లో వచ్చే జబదర్‌ దస్త్‌ ప్రోగ్రామ్‌ ఒకప్పుడు ఎంతో సందడిగా టీవీ రేటింగ్‌ హైప్‌లో వుండేది. అప్పట్లో రోజా సరదాగా కామెంట్లు, నాగబాబు నవ్వులు ఇలా కొంతకాలంగా బాగా సాగిన ఈ ప్రోగ్రామ్‌ ఒక్కసారిగా డౌన్‌ ఫాల్‌ అయింది. కామెడీ పేరుతో ద్వందార్థాలు శ్రుతిమించాయి. అప్పట్లోనే దానికి వంతపాడారు నాగబాబు. ఆ తర్వాత ఆయన ప్లేస్‌లో కొందరు వచ్చారు. ఇందులో నటించే నటీనటులు చాలా మంది దూరమయ్యారు. కొంతమంది సినిమాల్లోకి వెళ్ళిపోతే మరికొందరు పలు కార్యక్రమాలు బయట చేస్తున్నారు. ఇంకొందరు బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్ళారు. అయితే అక్కడనుంచి బయటకు వచ్చినవారుకానీ, దూరంగా వున్న నటులుకానీ బజర్‌దస్త్‌ లో జరిగే కొన్ని అవకతవకలు బయటపెట్టారు. సరైన ఫుడ్‌ వుండదనీ, పేమెంట్‌ సరిగ్గా వుండదంటూ కామెంట్లు చేసేవారు.
 
ఇవన్నీ ఒక భాగమైతే ప్రస్తుతం జబదర్‌ దస్త్‌కు దమ్మున్న కంటెంట్‌తో స్కిట్స్‌ రావడంలేదు. దీనికి అందులోని దర్శకులు తీరు, ఛానల్‌ వ్యవహారం కూడా ఓ కారణమని కొందరు బయట విమర్శిస్తున్నారు. ఇవి గ్రహించిన అదిరే అభి జబదర్‌ దస్త్‌కు దిష్టి తగిలిందంటూ ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. గతమంతా ఘనం. ఆ గతం మరలా జబదర్‌ దస్త్‌కు ఎప్పుడొస్తుందంటూ కూలంకషంగా తెలిపారు. ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ముందుముందు మరికొందరు కామెంట్‌ చేస్తారేమో చూడాలి.