జబర్దస్త్ షో నుంచి అందుకే బయటికి వచ్చేశా.. నాగబాబు కామెంట్స్
జబర్దస్త్ షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు ఎందుకు వెళ్లిపోయాడనేది చాలామంది చాలా కారణాలు చెప్తున్నారు. అయితే సింపుల్‌గా చెప్పాలంటే.. జీటీవీ డబ్బులెక్కువ ఇస్తున్నారు.. అందుకే ఈ టీవీ నుంచి షిఫ్ట్ అయ్యారని చెప్పేస్తున్నారు సినీ జనం. కానీ వెళ్లిపోయే సమయంలో మాత్రం మల్లెమాలపై చాలా సీరియస్ కామెంట్స్ చేశాడు నాగబాబు.
జబర్దస్త్ కామెడీ షోను ఓ రకంగా నిందించాడు. అక్కడ పద్దతులను తప్పు పట్టాడు. పైన తెలిసి జరుగుతుందో లేదో తనకు తెలియదు కానీ చాలా తప్పులు జరుగుతున్నాయని విమర్శించాడు నాగబాబు. ఇన్నేళ్లూ డబ్బులు తీసుకుని వెళ్ళే ముందు అలా విమర్శించడం కరెక్ట్ కాదు అంటూ నాగబాబును అప్పుడు విమర్శించిన వాళ్లు కూడా లేకపోలేదు.
ఇదిలా ఉంటే ఈయన బయటకు వచ్చేయడానికి కారణం ఇప్పుడు ఆయన నోటితోనే చెప్పాడు. జబర్దస్త్ కామెడీ షోను వదిలేసి రెండేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన్ని ప్రశ్నలు మాత్రం వెంటాడటం ఆగలేదు. తాజాగా అభిమానులతో ఛాట్ చేసిన ఈయన్ని మరోసారి ఫ్యాన్స్ ఇదే ప్రశ్నలు అడిగారు.
మీరెందుకు జబర్దస్త్ కామెడీ షోను వదిలేశారు సర్ అని అడిగితే మరో ఆలోచన లేకుండా ఐడియాలిజికల్ డిఫెరెన్స్ అంటూ సమాధానమిచ్చాడు. అంటే కొన్ని క్రియేటివ్ డిఫెరెన్సుల కారణంగానే బయటికి వచ్చానని క్లారిటీ ఇచ్చాడు నాగబాబు. ఆయన స్థానంలో చాలా మందిని ట్రై చేసిన తర్వాత ఇప్పుడు మనో ఫిక్సయ్యాడు.