బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (09:41 IST)

రంగోలి చందర్, డాక్టర్ రీతూ రనౌత్, అంజలీ చౌహాన్‌ కు ఛాలెంజ్‌ విసిరిన కంగనా రనౌత్

Kangana Ranaut
Kangana Ranaut
బాలీవుడ్ నటి క్వీన్ పద్మశ్రీ కంగనా రనౌత్ ఎప్పుడో ఎదో విషయంలో ప్రచారంలో ఉంటుంది. ఆమె నటించిన ధాకడ్ 20222లో విడుదల అయింది. తాజాగా ఆమె హైదరాబాద్ వచ్చింది. బుధవారం నాడు ఇక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. శంషాబాద్‌లోని పంచవటి పార్కులో సినీ నటి కంగనా రనౌత్ మొక్కలు నాటారు ఈరోజు బాలు మున్నంగి (జ్యోతిష్యుడు) ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించింది. 
 
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనతికాలంలోనే రెక్కలు విప్పి సామాన్యులను, సెలబ్రిటీలను ఆకర్షిస్తూ మొక్కలు నాటడం, చెట్లకు నీరు పోయడం, వృక్ష సంపదను కాపాడడం, ప్రకృతి మాతను కాపాడుకోవడంలో అందరినీ ప్రోత్సహిస్తోంది.
 
రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి కంగనా రనౌత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమని ఆమె అన్నారు.
 
ఈ ఛాలెంజ్‌ని అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని ఆమె కోరారు. మరియు ఆమె పచ్చదనాన్ని కొనసాగించడానికి రంగోలి చందర్, డాక్టర్ రీతూ రనౌత్ మరియు అంజలీ చౌహాన్‌లను నామినేట్ చేసింది..
 
ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకులు రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.