కాజల్ అగర్వాల్‌తో నటిస్తున్న కార్తికేయ గౌడ్
తెలుగులో పోసాని దర్శకత్వం వహించిన 'శ్రావణ మాసం' చిత్రంలోనూ, 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రాల్లో గుర్తింపు పొందిన పాత్ర పోషించిన కార్తికేయ గౌడ్.. ప్రస్తుతం హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. రణదీప్ హుడా, కాజల్ అగర్వాల్ నటిస్తున్న 'దో లఫ్ జోకి కహాని' చిత్రంలో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.
ఈ చిత్రం తాలూకు కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు తెస్తుందని కార్తీకేయ తెలియజేస్తున్నాడు. జూన్ 10న విడుదల కానున్న ఈ చిత్రానికి దీపక్ తిజోరీ దర్శకత్వం వహిస్తున్నారు.