గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 5 నవంబరు 2020 (15:14 IST)

కీర్తి... నీ సెలెక్షన్ ఇలా ఉందేంటి?

నేను శైలజ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుని.. అందరి దృష్టిని ఆకట్టుకుంది కీర్తి సురేష్. దీంతో అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. ఇక మహానటి సినిమాలో అలనాటి నాయిక సావిత్రి పాత్రను అద్బుతంగా పోషించి జాతీయ ఉత్తమ నటి అవార్డ్ సొంతం చేసుకుంది. దీంతో ఈ కేరళ కుట్టి పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది.
 
ఇక ఇండస్ట్రీలో అయితే... ఈ అమ్మడుకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే.. మహానటి తరువాత కీర్తి సురేష్‌ మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. వాటిలో పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఇప్పటికే ఓటీటీలో విడుదల అయ్యాయి. ఇక కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం గుడ్ లక్ సఖి. ఈ చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉంది. కరోనా కారణంగా థియేటర్స్ క్లోజ్ అవడంతో పెంగ్విన్ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసారు.
 
ఈ సినిమా హర్రర్ జోనర్లో రూపొందింది కాబట్టి ఓటీటీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకున్నారు కానీ... ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కీర్తి సురేష్‌ తాజా చిత్రం మిస్ ఇండియా. ఈ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా అన్ని వర్గాల నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఈ రెండు సినిమాలలో కీర్తి యాక్టింగ్ బాగున్నప్పటికీ.. ఆమె ఇలాంటి స్క్రిప్ట్స్ ఎలా ఎంచుకుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇకనైనా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటుందని ఆశిద్దాం.