గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (18:26 IST)

ఫిబ్ర‌వ‌రి 24న కిచ్చా సుదీప్ 3 డీ చిత్రం - విక్రాంత్ రోణ సిద్ధం

Sudeep - Vikrant Rona
క‌న్న‌డ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం విక్రాంత్ రోణ‌. పోస్ట‌ర్స్‌, గ్లింప్స్‌తో అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చిన ఈ త్రీ డీ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర‌స్ జాక్ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌, అలంకార్ పాండియ‌న్ తెలియ‌జేశారు. కిచ్చా సుదీప్‌తో, నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. రిలీజ్ డేట్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో కిచ్చా సుదీప్.. ఫాంటమ్ అనే స్టైలిష్ బైక్‌తో క‌నిపిస్తున్నారు. 
 
సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇస్తూ అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌డంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. 
 
నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ ‘‘మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా 3 డీ టెక్నాలజీలో రూపొందించిన ‘విక్రాంత్ రోణ‌’ను ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేస్తున్నాం అని తెలియ‌చేయ‌డానికి సంతోషిస్తున్నాం. మ‌న ప్రేక్ష‌కులు చాలా గొప్ప‌వాళ్లు. డిఫ‌రెంట్ సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తారు. వారిపై న‌మ్మ‌కంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ‌ను రూపొందించాం’’ అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు అనూప్ భండారి మాట్లాడుతూ ‘‘థియేటర్స్ సినిమాను ఎంజాయ్ చేసే ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన అనుభూతిని అందించ‌డానికి విక్రాంత్ రోణ చిత్రాన్ని రూపొందించాం.  త్రీ డీ టెక్నాల‌జీతో రూపొందించిన ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌లోనే ఎంజాయ్ చేయాలి. ఈ ప్ర‌పంచానికి స‌రికొత్త సూప‌ర్ హీరోను ప‌రిచ‌యం చేస్తున్నాం. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు విజువ‌ల్ ట్రీట్‌గా సినిమా అల‌రిస్తుంది. ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా కోసం ప్రేక్ష‌కుల‌తో పాటు మేం కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం’’ అన్నారు. 
 
జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన విక్రాంత్‌ రోణా మల్టిలింగ్వుల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌. 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీ లో విడుదల చేస్తున్నారు ఈ సినిమాను. అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్‌ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌ నిర్మాతలు. అలంకార్‌ పాండ్యన్‌ సహ నిర్మాత. బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. అవార్డ్ విన్నింగ్‌ ఆర్ట్ డైరక్టర్‌ మెస్మరైజ్‌ చేసే సెట్స్ వేశారు. విలియమ్‌ డేవిడ్‌ కెమెరాపనితనం విజువల్‌ ఫీస్ట్ గ్యారంటీ అనే ఫీలర్స్ ఇస్తోంది. కిచ్చా సుదీప్‌, నిరుప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.