సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (13:25 IST)

హీరో కిరణ్ అబ్బవరం సంతోషానికి అవధుల్లేవట.. ఎందుకంటే...

kiran abbavaram - pawan
తెలుగు చిత్రపరిశ్రమలోని యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. తనకు సరిగ్గా సరిపోయే కథలను ఎంచుకుంటూ ముందుగుసాగిపోతున్నాడు. తాజాగా ఆయన నటించిన కొత్త చిత్రం "నేను మీకు బాగా కావాల్సిన వాడిని". ఈ నెల 16వ తేదీన విడుదలకానుంది. సంజన హీరోయిన్. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మించారు. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించారు. అయితే, ఈ చిత్రం ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా రిలీజ్ చేశారు. దీంతో కిరణ్ అబ్బవరం సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
దీనిపై హీరో కిరణ్ అబ్బవరం స్పందిస్తూ, "పవన్ కళ్యాణ్ అభిమానిగా ఇది మరుపురాని క్షణాలు. అసలు సిసలైన సంతోషం అంటే ఇదే. థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ సార్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా తాను పవన్‌తో కలిసివున్న వీడియోను కిరణ్ అబ్బవరం కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.