ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (07:59 IST)

కసరత్తులతో కష్టపడుతున్న మహేష్ బాబు

Mahesh Babu
Mahesh Babu
మహేష్ బాబు తన రోజూ వారి వ్యాయామం చేస్తుంటాడు. అయితే షూటింగ్ కోసం తన ట్రైనీతో ఇలా చెస్తుంటాడు. ఈరోజు ఉదయం మహేష్ జిమ్ కెళ్ళినప్పుడు నమ్రత ఇలా ఫోటో పెట్టి తదుపరి సినిమాకోసం సిద్ధం అవుతున్నాడంటూ పోస్ట్ చేసింది. ఇది అభిమానులనుండి మంచి స్పందన వచ్చింది. ఎప్పుడు షూటింగ్లో ఉంటారు అంటూ కామెంట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మహేష్ చేస్తున్నారు. 
 
మహేష్ బాబు 28వ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మహేష్‌కి సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ని చిత్రీకరించనున్నారు చిత్రబృందం. మొదటి షెడ్యూల్ వారం రోజుల పాటు జరిగింది. సెకండ్  షెడ్యూల్  జరగనుంది. ఆ తర్వాత స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌కి షూటింగ్‌ని మార్చనున్నారు. అందులో సాంగ్స్ తీయనున్నారు. సంగీత దర్శకుడు S థమన్ మరోసారి చక్కటి బాణీలు చేయనున్నాడు.