శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (10:29 IST)

విజయ్ దేవరకొండ గురించి ఫ్రెండ్స్‌ ఇలా అడిగేవారు.. మాళవిక నాయర్

Malavika Mohanan
మలయాళ నటి మాళవిక నాయర్.. విజయ్ దేవరకొండ నటించిన ఎవడే సుబ్రమణ్యంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా చేసినప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. ఢిల్లీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ ఆమె వేసవి సెలవుల్లో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంది. 
 
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు చదువు కొనసాగించింది. పైలట్ కావాలని కలలు కన్నానని చెప్పింది మాళవిక నాయర్. ఢిల్లీలో ఇంటర్ తర్వాత హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. తాజాగా మాళవిక నాయర్ మాట్లాడుతూ, తాను ఇప్పటికే చాలా సినిమాల్లో నటించినప్పటికీ, ఆ సమయంలో కాలేజీలో తన స్నేహితులందరూ విజయ్ దేవరకొండ గురించి అడిగేవారని తెలిపింది.  
 
ఎవడే సుబ్రమణ్యం తర్వాత మాళవిక కళ్యాణ వైభోగమే, టాక్సీవాలా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు నాగశౌర్య ప్రధాన పాత్రలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయితో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి శ్రీనివాస్ అవసరాల చేత రూపుదిద్దుకుంది. ఈ నెల 17న సినిమా విడుదల కానుంది.