సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (16:53 IST)

మరోమారు ఉదారత చాటుకున్న చిరంజీవి - కెమెరామెన్‌కు ఆర్థిక సాయం

pdevaraj
మాన‌వ‌సేవే మాధవ సేవ అని మ‌న‌సావాచా న‌మ్మే మ‌రో సారి త‌న ఉదార‌త చాటుకున్నారు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.దేవరాజ్‌కు ఐదు లక్షల రూపాయల మేరకు ఆర్థిక సాయం చేశారు. దేవరాజ్ పరిస్థితిని చిరంజీవి తన టీమ్ ద్వారా తెలుసుకున్నారు. 
 
ఇటీవల, ఒక ఇంటర్వ్యూలో ఈ కెమెరామెన్ దేవరాజ్ తన దుస్థితిని వెల్లడించారు. ముఖ్యంగా, ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకుందామని బోరున విలపిస్తూ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీని.. దేవరాజ్‌ను తన నివాసానికి పిలిచి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. 
 
తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మలయాళం తదితర భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన దేవరాజ్... చిరంజీవి నటించిన టింగు రంగడు, రాణీ కాసుల రంగమ్మ, పులి బెబ్బులి వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫీ చేశారు