ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (10:58 IST)

విడుదల తేదీపై పుకార్లు నమ్మొద్దంటున్న "గాడ్‌ఫాదర్" టీమ్

godfather nayanathara
మెగాస్టార్ చిరంజీవ నటిస్తున్న తాజా చిత్రం "గాడ్‌ఫాదర్". ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్న తేదీ అంటే అక్టోబరు 5వ తేదీ కంటే ముందుగానే విడుదల చేయనున్నట్టు తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై ఆ చిత్ర బృందం గురువారం క్లారిటీ ఇచ్చింది. ఈ పుకార్లు నమ్మొద్దని, ముందుగా చెప్పినట్టుగా ఈ సినిమా అక్టోబరు 5వ తేదీన విడుదల కానుందని స్పష్టం చేసింది. 
 
అలాగే, హీరోయిన్ నయనతార పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ, ఆ పుకార్లకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. ఎస్ఎస్. థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా సంగీతం సమకూర్చుతున్నారు. 
 
ఇందులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే, సత్యదేవ్, సముద్రఖని, మురళీశర్మలు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 
 
కాగా, ఎన్వీ ప్రసాద్, ఆర్.బి. చౌదరిలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి తనయుడు, టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. మలయాళంలో వచ్చిన "లూసిఫర్" చిత్రానికి ఇది రీమేక్. అవినీతి రాజకీయాల సాగే అల్లిన కథతో తెరకెక్కిస్తున్నారు.