1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: శుక్రవారం, 11 నవంబరు 2022 (15:27 IST)

నాగ చైతన్య ద్విభాషా చిత్రం భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

Naga Chaitanya, Kriti Shetty, srinivas and others
Naga Chaitanya, Kriti Shetty, srinivas and others
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని  భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా నిర్మిస్తున్నారు.  ఈ చిత్రాన్ని పవన్ కుమార్  సమర్పిస్తున్నారు. నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది.
 
నాగ చైతన్య ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు హైదరాబాద్‌లో భారీ సెట్‌ వేశారు. అరవింద్ స్వామి టీమ్‌లో చేరారు. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని మహేష్ మాథ్యూ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. నాగ చైతన్య, అరవింద్ స్వామిలని కలసి తెరపై చూడటం ఆసక్తికరంగా వుండబోతుంది.
 
కృతి శెట్టి, శరత్‌కుమార్, సంపత్ రాజ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
 
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం నాగ చైతన్యకు మొదటి తమిళ చిత్రం కాగా, వెంకట్ ప్రభు ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
 
నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్‌జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు
 
సాంకేతిక  విభాగం- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
డైలాగ్స్: అబ్బూరి రవి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: విష్ణు తేజ్ పుట్ట