ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (17:03 IST)

9న నయతార - విఘ్నేష్ శివన్ వివాహం

nayan - vignesh
కోలీవుడ్ ప్రేమపక్షులు నయనతార - విఘ్నేష్ శివన్‌లు ఈ నెల 9వ తేదీన గురువాహం చేసుకోనున్నారు. చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురంలో వారిద్దరూ ఓ ఇంటివారుకానున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు విఘ్నేష్ శివన్ మంగళవారం ఉదయం చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 
 
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిజానికి తమ పెళ్లిని తిరుపతిలో జరుపుకోవాలని భావించామన్నారు. కానీ, కుటుంబ సభ్యుల రవాణా, బస ఏర్పాట్లు, ఇతరాత్రా కారణాల రీత్యా ఈ వివాహాన్ని మహాబలిపురంలో జరుపుకోవాన్న నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. 
 
గురువారం ఉదయం పెళ్లి జరుగుతుందని, ఈ పెళ్లి ఫోటోలను ఆ రోజు మధ్యాహ్నం మీడియాకు విడుదల చేస్తామన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరుగుతుందన్నారు. సాయంత్రం రిసెప్షన్ ఉంటుందని, 11వ తేదీ మధ్యాహ్నం మీడియాకు విందు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అయితే, ఈ పెళ్లి జరిగే ప్రాంతాన్ని మాత్రం ఆయన గోప్యంగా ఉంచారు.