బిగ్ బాస్‌.. ఎద భాగాన్ని మొత్తం బయటపెట్టేసిన మోనాల్.. మరీ ఇంతలా దిగజారాలా?

Monal Gajjar
Monal Gajjar
సెల్వి| Last Updated: సోమవారం, 12 అక్టోబరు 2020 (19:36 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు గంగవ్వ కాస్త క్రేజ్ తెచ్చింది. కానీ ఆమె హౌస్ నుంచి వెళ్లిపోయాక.. మోనాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బిగ్‌ బాస్‌ హౌస్‌లో మోనాల్‌, అభిజిత్‌, అఖిల్‌ మధ్య రొమాంటిక్‌ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ నడుస్తున్న సంగతి తెలిసిందే. అలకలు, కోపాలు, గొడవలు, హగ్‌లు ఇవన్నీ ఈ మధ్యే ఎక్కువగా జరుగుతున్నాయి.

ప్రతి సీజన్‌లో ఈ గ్లామర్, అఫైర్ మసాలా కోసం ఒక కంటెస్టెంట్‌ను తప్పకుండా తీసుకుంటారు. ఈ నాలుగో సీజన్‌లో ఆ స్థానాన్ని గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ భర్తీ చేసినట్టు ఇప్పటికే ప్రేక్షకులకు అర్థమైంది. అందుకే ప్రస్తుతం బయట మోనాల్ గజ్జర్ పేరు బాగా వినిపిస్తోంది. నిజానికి ఆమె తెలుగులో అల్లరి నరేష్‌తో కలిసి 'సుడిగాడు', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' సినిమాలు చేసింది.

కానీ, ఆ సినిమాలతో వచ్చిన గుర్తింపు కంటే ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పాపులారిటీనే ఎక్కువ. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో మోనాల్ గజ్జర్ గ్లామర్ షో కూడా బాగానే ఉంది. ఎంతైనా హీరోయిన్‌గా చేసింది కదా. ఆమెకు గ్లామర్ షో గురించి కొత్తగా చెప్పేదేమీ ఉండదు. అందుకే ఆమెకు బిగ్ బాస్ హౌజ్‌లో అందరి కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నారని టాక్. ఈ క్రమంలో మోనాల్‌కు అత్యధికంగా వారానికి రూ. 8 లక్షలు చెల్లిస్తున్నారట.

మరోవైపు.. మోనాల్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతున్నారని టాక్ వస్తోంది. ఈ షో స్టార్ట్ అయ్యిందంటే యూత్ పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం టీవీలకు హత్తుకపోతారు. ఇక శని, ఆదివారాల్లో మరింత ఇంట్రస్ట్‌గా షో చూస్తుంటారు. అయితే ఆదివారం మాత్రం షో చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఛీ.. ఛీ అనుకున్నారు. దీనికి కారణం మోనాల్ వేసుకున్న డ్రెస్.

ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మోనాల్ ధరించిన వస్త్రధారణపై పలు విమర్శలు వస్తున్నాయి. గతవారం కూడా ఇదే తరహా డ్రెస్ వేసింది. అయితే ఈ ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మరీ దిగజారింది. ఎద భాగాన్ని మొత్తం బయటపెట్టేసి.. మాటి మాటికి తన ఎద భాగం వైపు చూసుకోవడం.. సర్దుకోవడం చేసి బిగ్ బాస్ కెమెరామెన్లకు చేతి నిండా పని కల్పించింది.

ఆదివారం నాగార్జున వస్తారు.. అందంగా తయారవ్వాలనే ఉద్దేశం మంచిదే కాని.. దాచుకోవాల్సిన ప్రైవేట్ పార్ట్స్‌ని ఇలా బహిరంగం చేయడంపై ప్రేక్షకులు బండబూతులు తిడుతున్నారు. మరి మోనాల్ దెబ్బకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరం కావడం ఖాయమనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.దీనిపై మరింత చదవండి :