అది చూపించలేదు, చివరలో ఏడ్చింది చూపిస్తారేంటి? (video)

Swathi Deekshit
జె| Last Updated: శనివారం, 10 అక్టోబరు 2020 (20:33 IST)
తెలుగులో కాస్త పెద్ద రచ్చే నడుస్తోంది. బాగా ఆడుతున్న వారిని ఎలిమినేట్ చేస్తున్నారని అభిమానులు రచ్చ రచ్చ చేసేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి మరీ నిరసన చెబుతున్నారు. కరోనా టైంలో బిగ్ బాస్ సృష్టిస్తున్న హంగామా అంతాఇంతా కాదు.

ఇప్పుడు హౌస్‌లో చర్చ నడిచేది మొత్తం స్వాతి దీక్షిత్, నోయెల్. ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరికొకరు దగ్గరయ్యారు. ప్రేమించుకున్నారంటూ బాగానే ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా బిగ్ బాస్ షోలో వారిద్దరి మధ్య జరిగిన విషయాలు ప్రసారం చేయలేదు.

ఒక్కసారిగా నోయెల్ ఏడ్చిన సన్నివేశాలు బయటకు రావడం పెద్ద దుమారాన్నే రేపింది. దీంతో స్వాతి దీక్షిత్ కాస్త ఎలిమినేట్ కూడా అయిపోయింది. అసలు బిగ్ బాస్ షోలో ఏం చూపిస్తారో నాకు అర్థం కావడం లేదు. ఏదీ సరిగ్గా చూపించడం లేదు.

నాకు నోయెల్‌కు మధ్య జరిగిన ఘటనలు అస్సలు బయటకు రాలేదు. ఉన్నట్లుండి అతను ఏడ్చింది చూపెట్టారు. అంటే నా వల్ల ఇదంతా జరిగిందని నా అభిమానులు కొంతమంది భావించారు. మరికొంతమంది అర్థం చేసుకోగలిగారు. అసలు నోయెల్ హెల్త్ బాగా లేదు. లెగ్ పెయిన్స్ ఎక్కువగా ఉంది.

నేను, నోయెల్ ఫ్రెండ్స్‌గా కొనసాగాం. ఎక్కువరోజులు కలిసి ఉన్నాం. నేను ఎలా ఉంటానో అభిమానులకు తెలుసు. అలాంటిది హౌస్ లోకివెళితే మరీ కామ్‌గా ఉండిపోతాను. ఇదంతా నమ్మేలా ఉంది. ఒక్కటి మాత్రం నిజం. జరుగుతున్న షోలో మొత్తాన్ని చూపిస్తే అసలు అభిమానులకు అర్థం అవుతుంది. అంతేగానీ అసలు చూపించకుండా చివరలో చూపిస్తేనే నష్టం తప్పదంటూ ఏడ్చేసింది స్వాతి దీక్షిత్.

దీనిపై మరింత చదవండి :