సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 జూన్ 2018 (10:18 IST)

ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అప్పుడే.. బాలయ్య గురించి బ్రహ్మణి ఏం చెప్పారంటే?

మహానటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా... క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సిన

మహానటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా... క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 9న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఈ  చిత్రాన్ని విడుదల చేస్తామని సినీ యూనిట్ వెల్లడించింది. 
 
1983లో అదే రోజున ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని.. అందుకే అదే రోజున సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సినీ యూనిట్ వెల్లడించింది. సంక్రాంతి బరిలో మంచి రికార్డ్ ఉన్న బాలయ్య... ఈ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటాడని.. సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోడలు, హీరో బాలకృష్ణ కుమార్తె, మంత్రి లోకేష్ భార్య, మహిళా పారిశ్రామికవేత్త నారా బ్రహ్మణి, ఫాదర్స్ డే సందర్భంగా తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రజలకు సేవ చేయాలన్నదే నాన్న లక్ష్యమని, మంచి సినిమాలు చేయాలన్నది కూడా ఆయన టార్గెట్‌లలో ఒకటని బ్రాహ్మణి తెలిపారు. 
 
సింపుల్‌గా వుండటమే ఆయనకిష్టమని.. అదే తమకూ నేర్పారని చెప్పారు. నటుడిగా, ప్రజా నాయకుడిగా ఆయన సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. హిందూపురంలో జరిగిన అభివృద్ధి గురించి జనం గొప్పగా చెబుతుంటే ఎంతో పొంగిపోతుంటానని చెప్పుకొచ్చారు. అక్కడి మంచినీటి సమస్య పరిష్కారానికి తన తండ్రి ఎంతో శ్రమించారని చెప్పారు. త్వరలో అమరావతిలో ఓ కేన్సర్ హాస్పిటల్‌ను ఆయన ప్రారంభించనున్నట్లు బ్రాహ్మణి వెల్లడించారు.