ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (19:02 IST)

హారర్, కామెడీ తో ఓ మంచి ఘోస్ట్ రాబోతుంది

O manchi ghost  release poster
O manchi ghost release poster
మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ‘ఓ మంచి ఘోస్ట్’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో ప్రముఖ కమీడియన్ వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. డా.అబినికా ఇనాబతుని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం నిర్మించగా.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్‌, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
‘ఓ మంచి ఘోస్ట్’ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. జూన్ 14న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో  వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్ వంటి వారు కనిపిస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమా ఆద్యంతం నవ్విస్తూ, భయపెట్టేలా కనిపిస్తోంది.
 
నటీనటులు : వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు తదితరులు